జెట్ ఎయిర్‌వేస్ ప్రయాణంలో ప్రయాణికుడు మృతి...
- November 08, 2016
విమాన ప్రయాణంలోనే ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దిల్లీ నుంచి ఖతార్ రాజధాని దోహాకు వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో చోటుచేసుకుంది. ప్రయాణికుడు అస్వస్థతకు గురవ్వడంతో వైద్య సహాయం కోసం వెంటనే విమానాన్ని కరాచీకి మళ్లించారు. ముందుగానే అక్కడ వైద్య సహాయం కోసం ఏర్పాట్లు కూడా చేయించారు. అయితే కరాచీ చేరుకునేప్పటికే ప్రయాణికుడు మృతి చెందినట్లు జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. సోమవారం రాత్రి దిల్లీ నుంచి బోయింగ్ 737 విమానం 141 మంది ప్రయాణికులతో బయలుదేరగా ఈ ఘటన జరిగింది. అయితే మరణించిన ప్రయాణికుడి వివరాలను జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించలేదు.ప్రయాణికుడి మృతదేహాన్ని అధికారులకు అప్పగించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది
తాజా వార్తలు
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా







