మెరుగైన సేవలపై కొత్త రాయబారి హామీ

- November 08, 2016 , by Maagulf
మెరుగైన సేవలపై కొత్త రాయబారి హామీ

భారతీయ వలసదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని భారతీయ రాయబారి కుమరన్‌ చెప్పారు. ఇండియన్‌ కల్చరల్‌ సెంటర్‌ సహా పలు భారతీయ సంఘాలుఏ ఆయన్ను కలిశాయి. ఈ సందర్భంగా 2017 జనవరిలో జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ సెలబ్రేషన్స్‌పైన కూడా పలువురు, కుమరన్‌కి విజ్ఞప్తులందించారు. మూడు నాలుగేళ్ళుగా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు, కుమరన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని, దోహాలో మరో చోట కొత్తగా కాన్సురల్‌ సర్వీసులు అందుబాటులో ఉండేలా చేస్తానని కుమరన్‌ ఈ సందర్భంగా తెలిపారు. దోహాలోని అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంతోపాటుగా, అల్‌ కోర్‌ మరియు ఇండస్ట్రియల్‌ ఏరియా కూడా పరిశీలనలో ఉంది. ప్రవాసీ భారతీయ దివస్‌ కోసం 75 మంది బెంగళూరుకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లు కుమరన్‌కి తెలియజేశారు. అలాగే కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న కాలికట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అప్‌గ్రేడింగ్‌ సర్వీసులపైన కూడా కొందరు విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. ఇండియన్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ కొన్ని దుబాయ్‌లో క్యాంపస్‌లను నిర్వహిస్తున్నాయనీ, అలాగే గల్ఫ్‌లోని ఇతర దేశాల్లోనూ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేలా ప్రయత్నించాల్సిందిగా విజ్ఞప్తులను అందుకున్న కుమరన్‌, వాటిని హయ్యర్‌ అథారిటీస్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com