నల్లధనం అరికట్టడంలో భాగంగా తీసుకున్న నిర్ణయo..
- November 08, 2016
రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేశామని, అదేవిధంగా, రేపు, ఎల్లుండి ఏటీఎంలు పని చేయవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో నల్లధనాన్ని ఊడ్చిపారేసే కార్యక్రమానికి ప్రజలందరూ సహకరిస్తే, మరింత ప్రయోజనం లభిస్తుందని అన్నారు. నల్లధనం, దొంగనోట్లతో ఆటలాడేవారి ఆట కట్టిద్దామని, దుర్మార్గుల చేతుల్లోని రూ.500, రూ.1000 నోట్లు నేటి అర్ధరాత్రి నుంచి చిత్తుకాగితాల్లా మారతాయని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిజాయతీ గల పౌరులకు కొంత అసౌకర్యం కల్గుతుందని మోదీ అన్నారు.విదేశీ శక్తులు నకిలీ రూ.500, రూ.1000 నోట్లను దేశంలో చెలామణి చేస్తున్నాయని, నిజమైన నోట్లు, నకిలీ నోట్లు గుర్తించలేనంతగా ఉన్నాయని ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ అన్నారు.నోట్ల మార్పిడి విధివిధానాలను ఆర్ బీఐ రూపొందించిందని, రూ.500, రూ.2 వేల రూపాయల కొత్త నోట్లు జారీ చేస్తామని, ప్రజల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇతరుల సొమ్మును మీ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వొద్దని, కొత్త నోట్లు నవంబర్ 10న విడుదల చేస్తామని చెప్పారు.ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సర్జికల్ స్ట్రయిక్స్ ను తలపించేలా ఎలాంటి లీకేజ్ లేకుండా హఠాత్తుగా ప్రకటించడంతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. నల్లధనం అరికట్టడంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా అంగీకరిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రభుత్వానికి కొమ్ముకాసే కార్పొరేట్లు దీనిని ఏ విధంగా తీసుకుంటాయి? అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన అవినీతి ఉద్యోగులు, కోట్లకు కోట్లు పోగేసిన అవినీతి రాజకీయనాయకులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోగలరా? అన్నది కాస్త సందేహమే. అయితే తాజా నిర్ణయంతో ప్రధాని మోదీ ఇమేజ్ అమాంతం ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







