పాకిస్థాన్ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది..
- November 08, 2016
పాకిస్థాన్ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో సేవలందిస్తున్న అధికారులు అనురాగ్‌సింగ్, విజయ్‌కుమార్ వర్మ, మాధవన్ నందకుమార్‌లు మంగళవారం స్వదేశానికి పయనమయ్యారు. మహమూద్ అక్తర్‌తోపాటు మరికొంతమంది పాక్ దౌత్యవేత్తలు.. భారత్‌లో గూఢచర్యానికి పాల్పడ్డట్లుగా గత నెలలో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పేర్లు బహిర్గతం కావడంతో పాక్ వారిని వెనక్కిపిలిపించింది. ఇటు ప్రతీకార చర్యగా ఎనిమిది మంది భారత దౌత్యవేత్తలపై కూడా గూఢచర్య, ఉగ్రవాద సంబంధ ఆరోపణలు మోపుతూ పాక్ వివరాలు వెల్లడించింది. దీంతో భారత్ కూడా తమ దౌత్యవేత్తలను వెనక్కిరప్పించేందుకు చర్యలు తీసుకుంది.
మరో ఐదుగురు అధికారులు వాఘా సరిహద్దు ద్వారా రహదారి మార్గంలో భారత్‌కు రానున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







