'గాలి'కి వచ్చిన పెళ్లి కష్టాలు
- November 09, 2016
మన దేశంలో జరిగే బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ మీద అందరికీ ఆసక్తులు ఉండడం కామన్. పెళ్లి పత్రికల నుంచి పెళ్లి చీరలు, పెళ్లి వంటకాల దాకా అన్నిటిమీదా బ్రేకింగ్ న్యూసే. ఈసారి 200 కోట్ల బడ్జెట్ తో జరిగే బళ్లారిఘనుడు గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి మీద దేశమంతా ఓ కన్నేసి ఉంచింది. ఈనెల 16న జరగబోయే ఈ వివాహ వైభోగానికి సడన్ గా ఓ బ్రేక్ వచ్చి పడింది. పెద్ద నోట్లను బ్యాన్ చేసిన మోదీ సర్కార్. బళ్ళారిలో వాటి చెలామణీకి గండి కొట్టేసింది. ఇటు.. వంద కోట్ల ఖర్చుతో వెయ్యి రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు బడాయిగా స్టేట్ మెంట్ వచ్చేసింది. క్యాటరింగ్ కంపెనీ వాళ్లయితే ఇప్పుడు తల పట్టుకుని కూర్చుండిపోయారు.
ప్రతి చిన్న కొనుగోలుకీ పెద్దనోట్లతోనే పనిబడ్డం.. ఆ పెద్ద నోట్లన్నీ బైటికి తీసే ధైర్యాలు లేకపోవడం.. ఈ గందరగోళంతోనే ఇప్పుడు గాలి వారి పెళ్లిసందడికి బ్రేకులు పడిపోయినట్లయింది. కనీవినీ ఎరుగని రీతిలో కూతురి పెళ్లి చెయ్యాలన్న గాలివారి కల నెరవేరాలని ఆయనఅభిమానులు కోరుకుంటున్నారు. మధ్యలో ఈ నల్ల మరియు పెద్ద నోట్ల బెడద ముంచుకొచ్చిందని తెగ చికాకు పడిపోతున్నారు. ఇప్పుడు కన్నడ మీడియాలో ఈ వార్తలే హల్ చల్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







