డిసెంబర్‌లో ముష్రిఫ్‌ నేచురల్‌ అడ్వెంచర్‌ పార్క్‌ ప్రారంభం

- November 10, 2016 , by Maagulf
డిసెంబర్‌లో ముష్రిఫ్‌ నేచురల్‌ అడ్వెంచర్‌ పార్క్‌ ప్రారంభం

దుబాయ్‌: దుబాయ్‌ మునిసిపాలిటీ తొలి నేచురల్‌ అడ్వెంచర్‌ పార్క్‌ని డిసెంబర్‌లో ప్రారంభించనుంది. ముష్రిఫ్‌ ఏరియాలో ఈ పార్క్‌ ఏర్పాటయ్యింది. ట్రైనింగ్‌ మరియు ఛాలెంజింగ్‌ గేమ్స్‌ అలాగే పిల్లలకు, పెద్దలకు కొండలు ఎక్కేందుకుగాను అన్ని ఏర్పాట్లు ఈ పార్క్‌లో చేయబడ్డాయి. దుబాయ్‌ మునిసిపాలిటీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జుమా అల్‌ ఫకీ మాట్లాడుతూ, తొలి ఏడాదిలో 23,000 మందిని ఈ పార్క్‌ ఎట్రాక్ట్‌ చేస్తుందనీ, రెండో ఏడాదిలో 35,000 మంది విజిటర్స్‌ వస్తారనీ, నాలుగో ఏడాదిలో 69,000 మంది ఈ పార్క్‌ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. రోజుకి 600 మంది ఈ పార్క్‌ని సందర్శించే అవకాశం ఉంది. కార్పొరేట్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌, టీమ్‌ బిల్డింగ్‌ ఈవెంట్స్‌కి అనువుగా ఈ పార్క్‌ని తీర్చిదిద్దారు. స్కూల్స్‌కి ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్స్‌ కోసం కూడా ఈ పార్క్‌ అనువుగా ఉండనుంది. ప్రకృతితో సాన్నిహిత్యం ప్రతి మానవుని విధి అని, యువతరం ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ప్రకృతితో మమేకమవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా పార్క్స్‌ మరియు హార్టీ కల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ అవధి వ్యాఖ్యానించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com