కేంద్ర సర్కారు నిర్ణయంతో పెరగనున్న విమాన చార్జీలు??
- November 11, 2016
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశీయ విమాన చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు ఉద్దేశించిన నిధి కోసం ప్రత్యేకంగా ఒక లెవీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దూరాన్ని బట్టి వివిధ విమాన ప్రయాణాలపై లెవీ విధించనున్నట్లు ప్రకటించింది. విమానయాన సంస్థలు ఎటూ ఈ మొత్తాన్ని ప్రయాణికుల మీదే మోపుతాయి కాబట్టి టికెట్ల ధరలు పెరగడం ఖాయమని అంటున్నారు.
లెవీ వివరాలు ఇలా ఉన్నాయి... వెయ్యి కిలోమీటర్ల లోపు దూరం వెళ్లే విమానాలకు రూ. 7,500 లెవీ విధిస్తారు. అలాగే 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు దూరం వెళ్లే విమానాలకు రూ. 8000, 1500 కిలోమీటర్లకు మించిన దూరం వెళ్లే స్వదేశీ విమానాలకు రూ.8,500 చొప్పున ఈ రీజనల్ కనెక్టివిటీ లెవీ ఉంటుంది. దాంతో విమాన చార్జీలు కూడా ఆ మేరకు పెరగక తప్పదు. అయితే.. మొత్తం విమాన ప్రయాణానికి కలిపి ఈ లెవీ ఉంటుంది కాబట్టి, అది మొత్తం అన్ని టికెట్లకూ పంపిణీ అవ్వాలి.
ఆ లెక్కన చూసుకుంటే తక్కువ మొత్తమే పెరగాలి. కానీ ఎంత మేర పెరుగుదల ఉంటుందనేది నిర్ణయం పూర్తిగా అమలైతే తప్ప తెలియదు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







