డ్రగ్ స్మగ్లర్స్‌కి 10 ఏళ్ళ జైలు
- November 11, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఇద్దరు వలసదారులైన పురుషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. దాంతోపాటుగా 200,000 ఖతారీ రియాల్స్‌ని జరీమానా విధించింది. ఈ ఇద్దరు నిందితులు అక్రమంగా డ్రగ్స్‌ని సరఫరా చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో వ్యక్తికి ఏడాది జైలుతోపాటు 10 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. డ్రగ్స్ సేవించిన ఆరోపణలు ఆ వ్యక్తిపై ఉన్నాయి. ఓ మెయిడ్ తనకు ఓ అపరిచిత వ్యక్తి, తన చేతిలో ఓ బ్యాగ్ పెట్టి ఓ చోట ఇవ్వాల్సిందిగా కోరాడనీ, అయితే తాను అందుకు అంగీకరించలేదని తన యజమాని సన్నిహితుడితో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, నిందితుల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు, రిప్రెజెంటేటివ్కి 15,000 రియాల్స్‌ని ఆఫర్ చేశాడు బ్యాగ్‌ని తరలించేందుకోసం. బ్యాగ్‌లో కిలో బరువైన నిషేధిత డ్రగ్ మురిజువానాని పోలీసులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







