డయాబెటిస్‌ వ్యతిరేక వాకథాన్‌ - 10,000

- November 11, 2016 , by Maagulf
డయాబెటిస్‌ వ్యతిరేక వాకథాన్‌ - 10,000

డయాబెటిస్‌ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలనీ, అవగాహనతో డయాబెటిస్‌ని దూరం చేసుకోవడమే కాకుండా, డయాబెటిస్‌ వచ్చినవారు తదనంతరం వచ్చే సమస్యలకు దూరంగా ఉండొచ్చని డయాబెటిస్‌ వ్యతిరేక వాకథాన్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ వాకథాన్‌లో 10,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. మ్యూఇజమ్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఆర్క్‌ పార్క్‌లో ఈ వాకథాన్‌ జరిగింది. కుటుంబాలతో సహా ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందించదగ్గది. బీట్‌ డయాబెటిస్‌ వాకథాన్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఖతార్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌, ల్యాండ్‌ మార్క్‌ గ్రూప్‌ సహాయంతో నిర్వహించింది. క్యుడిఎ ఎగ్జిక్యూఇవ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్దుల్లా అల్‌ హమాక్‌, న్యాండ్‌ మార్క్‌ గ్రూప్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ సంతోష్‌ పాయ్‌ తదితరులు ఈ వాకథాన్‌ని జెండా ఊపి ప్రారంభించారు. వచ్చే ఏడాది ఖతార్‌ ఫౌండేషన్‌లో ఈ వాకథాన్‌ని నిర్వహిస్తామని డాక్టర్‌ అల్‌ హమాక్‌ చెప్పారు. వాకథాన్‌లో ఫ్రీ బ్లడ్‌ సుగర్‌ స్క్రీనింగ్‌ కూడా నిర్వహించారు. డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడుతూ, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌ సమస్యల్ని తగ్గించుకోవచ్చని వైద్యులు వివరించారు. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని వారు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com