మనుషుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
- November 11, 2016
హ్యూమన్ ట్రాఫికింగ్‌కి సంబంధించిన క్రైమ్ గతంతో పోల్చితే ఇప్పుడు బాగా తగ్గిందని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖామిస్ మట్టర్ అల్ మజెనా చెప్పారు. 2010లో ఇలాంటి నేరాలు 35 నమోదు కాగా, ఈ ఏడాది కేలం ఐదు మాత్రమే నమోదైనట్లు ఆయన తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ డిప్లొమా పొందిన 22 మంది విద్యార్థులకు పట్టాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హ్యూమన్ ట్రాఫికింగ్‌పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామనీ, ఇంకా ఈ విభాగంలో కొత్త సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దుబాయ్ పోలీసులు ఈ విషయంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఖామిస్ మట్టర్ అల్ మజెనా చెప్పారు. అరబ్ ప్రపంచంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఇదే తొలి డిగ్రీ అని ఆయన చెప్పారు. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకునేందుకు సబ్జెక్ట్‌లో కొత్త కొత్త విధానాల్ని ప్రవేశపెట్టామని, బాధితుల్ని ఆదుకోవడం, అలాగే నిందితుల్ని కనుగొనడంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. దుబాయ్ పోలీస్ - హ్యూమన్ ట్రాఫికింగ్ క్రైమ్ కంట్రోల్ సెంటర్, 40 వర్క్ షాప్‌లను నిర్వహించగా, 1,635 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 16,647 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారు. 2015లో 15 కేసులు నమోదయ్యాయి. అవిప్పుడు 6కి తగ్గిపోయాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







