విక్రమ్,గౌతమ్ ల కొత్త చిత్రం
- November 12, 2016
'ఇరుముగన్' సినిమాతో కాస్త ట్రాక్‌లో పడ్డారు నటుడు విక్రం. త్వరలో ఆయన 'సామి 2' చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లేకుంటే ఏకకాలంలో మరో చిత్రంలో కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి గౌతం మేనన్ దర్శకత్వం వహించనున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీని గురించి గౌతం మేనన్ మాట్లాడుతూ విక్రంతో ఓ సినిమాను రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు చెప్పారు. మరోవైపు 'ఇరుముగన్' ఫేమ్ ఆనంద్ శంకర్ వద్ద కూడా విక్రం కథ విన్నట్లు సమాచారం.
దీన్ని కూడా పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు విక్రం. కానీ గౌతం మేనన్ సినిమాకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







