మక్కా ఫెస్టివల్ - ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్
- November 12, 2016
జెడ్డా: పవిత్ర మక్కా చరిత్ర మరియు హెరిటేజ్‌ని తెలుసుకునేందుకు చక్కని అవకాశం ఇది. గురువారం మక్కా ఫెస్టివల్లో ఈ అంశాల్ని ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుత స్కూల్ టెర్మ్ వెకేషన్లో ఈ ఫెస్టివల్‌ని సందర్శిస్తే, మక్కాకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. మక్కా మేయర్ ఒసామా అల్ బర్ ఈ ఫెస్టివల్‌ని ప్రారంభించారు. 30 రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. అల్ జహ్రా డిస్ట్రిక్ట్‌లోని అల్ దహియా మార్కెట్ వద్ద మక్కా లివింగ్ స్టైల్స్‌తో ఈ ఫెస్టివల్‌ని ఏర్పాటు చేశారు. మక్కా పరిసరాలకు సంబంధించిన మోడల్ని కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, మక్కాపై సెమినార్స్కూడా ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. పిల్లల కోసం అనేక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్‌ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ఈవెంట్స్‌ని ఈ ఫెస్టివల్లో నిర్వహిస్తారు. ఇష్రా ప్రేయర్ తరువాత గంటపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









