గిన్నీస్‌బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నా భారతీయుడు ..
- November 14, 2016
దుబాయ్‌లో స్థిరపడ్డ భారతీయుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. శరణార్థ చిన్నారులకోసం కేవలం ఒక్క రోజులో 10,975 కేజీల స్టేషనరీని సేకరించి రికార్డు సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది శరణార్థ చిన్నారులకు పంచిపెట్టేందుకు అతడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని తిరునవ్వేలిలో జన్మించిన కృష్ణమూర్తి 1992 నుంచి దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కృష్ణమూర్తి 'ఎడ్యుకేషన్ ఫర్ ఆల్' అనే ఒక స్వచ్చంధ సంస్థను ప్రారంభించారు. దాని ద్వారా విద్యార్థుల వద్ద నుంచి పుస్తకాలు, బొమ్మలు, స్టేషనరీ వంటివి సేకరించి భారత్, ఆఫ్రికాలోని పేద పిల్లలకు పంచిపెడుతున్నారు.ఈ క్రమంలో ప్రపంచంలోని శరణార్థ చిన్నారులకు అందించేందుకు ఆయన స్టేషనరీని సేకరించే కార్యక్రమం ప్రాంభించారు. కార్యక్రమంలో భాగంగానే ఒక్క రోజులో 10,975 కేజీల స్టేషనరీని సేకరించి గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.సంస్థకు చెందిన 400 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని 50,000 నోటు పుస్తకాలు, 3లక్షల పెన్సిళ్లు, 2,000 బ్యాగులు సేకరించారు. 2015లో సౌదీ అరేబియాలో సేకరించిన 4,571 కేజీలు స్టేషనరీ రికార్డును కృష్ణమూర్తి బద్దలు చేశారు. ఎమరేట్స్ రెడ్ క్రిసెంట్ సంస్థ వీటిని శరణార్థులకు అందించేందుకు ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ' చిన్నారులకు ఆనందాన్ని అందివ్వడమే సంస్థ ఉద్దేశం. ప్రంపచంలో ఎన్నో అవసరాలు కలిగిన ఉన్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు మా ప్రయత్నం' అని అన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









