శబరిమలలో తెరుచుకున్న అయ్యప్ప ఆలయం
- November 15, 2016
శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని మంగళవారం తెరిచారు. ఈ ఏడాది అయ్యప్ప సీజన్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. 41 రోజులపాటు నిర్వహించే మండలం పండుగ గురు వారం నుంచి మొదలవుతోంది. తొలి రోజునే స్వామి దర్శనం చేసుకునేందుకు అప్పుడే పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు. కొద్ది రోజుల్లో భారీసంఖ్యలో భక్తులు చేరుకునే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. నిరుడు 4.5 కోట్లమందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రధానార్చకుడు కందరారు రాజీవరారు వెంటరాగా, త్వరలో బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ప్రధానార్చకుడు ఎస్ఈ శంకరన్ నంబూద్రి మంగళవారం సాయంత్రం గర్భాలయాన్ని తెరవడంతో కార్యకలాపాలు సంప్రదాయసిద్ధంగా ప్రారంభమయ్యాయి.
ప్రధానార్చకుడు బుధవారం ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం నిర్వహిస్తారు. తెల్లవారుజామున మూడున్నరకు అష్టాభిషేకం చేసిన తర్వాత.. నేతితో అభిషేకం చేస్తారు. మండలపూజ తర్వాత డిసెంబరు 26న మండలం పండుగ ముగుస్తుంది.
ఆదే రోజు సాయంత్రం గుడిని మూసివేస్తారు. 'మకరవిలక్కు' పండుగ కోసం ఆలయాన్ని మళ్లీ డిసెంబరు 30న తెరుస్తారు. జనవరి 14న భక్తులు మకరజ్యోతిని దర్శించుకుంటారు. జనవరి 20న గుడిని మూసివేస్తారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







