పూర్తిస్థాయి వినోదభరిత చిత్రo 'మీలో ఎవరు కోటీశ్వరుడు'...
- November 17, 2016
నవీన్‌చంద్ర, శృతిసోది నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఇ.సత్తిబాబు దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ, 'పూర్తిస్థాయి వినోదభరిత చిత్రమిది. నాగేంద్రకుమార్ మంచికథ అందించగా, క్రాంతి డైలాగ్స్ అందించారు. నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, 'మా సంస్థ నిర్మిస్తున్న ఆరవ చిత్రమిది.ఇలాంటి కథను ఎవరు చేస్తే బావుంటుందా అని ఆలోచిస్తే సత్తిబాబు అయితే మంచిటైమింగ్‌తో సినిమా తీస్తారని భావించాం. ఒక పాట మినహా సినిమా పూర్తయింది. అయితే గేమ్ షో చిత్రం కాదు. అందరినీ కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది' అని అన్నారు.హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ, 'ఇంతవరకు నేను ప్రేమ, యాక్షన్ సినిమాలే చేశాను. అయితే నాతో కామెడీ సినిమా చేస్తానని రాధామోహన్ చెప్పగానే ఈ తరహా సినిమాలు చేయలేదని చెప్పాను. దాంతో సత్తిబాబుగారిని కలవమని ఆయన చెప్పారు. కథ ఎంతోబాగా నచ్చడంతో వెంటనే చేసేందుకు అంగీకరించాను' అని చెప్పారు.కథానాయిక శృతిసోది మాట్లాడుతూ, ఇందులో ధనవంతురాలైన అమ్మాయి పాత్రను పోషించానని చెప్పగా, నటుడు పృథ్వి మాట్లాడుతూ, 'బెంగాల్ టైగర్' తర్వాత మరోసారి ఈ సంస్థ తీసిన ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







