తాజా భర్తతో ప్రణయంతో.. మాజీ భర్తకు ప్రళయం.. డిసెంబర్ 12 న తీర్పు
- November 18, 2016
మనామా: భర్తకు బిడ్డలకు తెలియకుండా ప్రియుడితో పొరుగు దేశం వెళ్ళిన ఓ మహిళపై ఆమె భర్త లబోదిబోమంటూ కేసు పెట్టాడు. నీకు ఎపుడో విడాకులు ఇచ్చేశానని... తన రెండవ భర్తతో ఏకాంత సేవ గడపనివ్వరా అంటూ ఎదురు దాడికి దిగింది..అంతేకాక ఆమె కోర్టుకి విడాకుల పత్రాలు ఆవేశంగా సమర్పించింది. కొసమెరుపుగా కోర్టులో ఆ విడాకుల పత్రాలు ఫోర్జరీ చేసినవాని అని తేలడంతో అదనంగా ఆ మహిళపై ఫోర్జరీ కేసు సైతం నమోదయ్యంది... ఈ మూడు స్తంభాలాట వార్త కు సంబంధించిన వివరాలలోకి వెళితే, 32 ఏళ్ల వ్యాపారవేత్త అయిన ఒక మహిళ వ్యభిచారం మరియు ఫోర్జరీ కేసులో ముద్దాయి కాగా ఆమెపై సాక్షుల విచారణను ప్రాసిక్యూషన్ డిసెంబర్ 12 వ తేదీన ట్రయల్ కోర్టులో నిరూపించడానికి నిర్ణయించింది. ఒక మహిళ వ్యతిరేకంగా ఈ కేసును ఆమె భర్త కేసుని దాఖలు చేశాడు. 14 సంవత్సరాల క్రితం వారు ఇరువురు వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య కాపర ఫలితంగా ఇద్దరు అమ్మాయిలు సైతం జన్మించారు. అయితే, ఇటీవల ఆమె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఇటీవల వారు ఇరువురు ఈజిప్ట్ వెళ్ళి ఏకాంతంగా గడిపి వచ్చారని ఆ భర్ తన నివేదికలో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు జరిపిన అనంతరం ఆ స్త్రీ ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఆమె చెబుతున్న వాదనలు ఏమాత్రం ధ్రువీకరించబడలేదని కోర్టులో ఆ మహిళపై కేసును ఫైల్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 32 ఏళ్ల మహిళ తాను తన భర్తకు విడాకులు ఎపుడో ఇచ్చేనని పేర్కొంటుంది. అయితే ఆమెపై భర్త కేసు దాఖలు చేసిన తరువాత ఆమె విడాకులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిగో ఆ విడాకుల సర్టిఫికేట్ కాపీని పోలీసులకు అందించింది ఆమె ఈ మేరకు ఆ పత్రాలను చూపింది. పోలీసుల పరిశీలనలో అవి నకిలీ పత్రాలుగా కనుగొనబడింది. దీనితో ఆ మహిళపై కోర్టు ఫోర్జరీ అభియోగాల కేసు సైతం నమోదు కాబడింది. ఆ స్త్రీ తన వాంగ్మూలంలో పేర్కొంటూ, తాను వివాహం చేసుకొన్న రెండవ భర్తతోనే ఈజిప్ట్ లో సంసారం చేసినట్లు వాదించింది. తన రెండవ తాజా భర్త ఒక సైనికుడని ఆయనకు తనతో బహరేన్ లో ఏకాంత సమయంకు అనుమతి పొందడానికి సమయం పడుతుందని అందుకే తాము ఈజిప్ట్ వెళ్లినట్లు తెలిపింది. " నాకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసిన నా మాజీ భర్త తనకు మధ్య ప్రస్తుతం వ్యాజ్యాలు నడుస్తున్నాయి " షరియత్ న్యాయస్థానం మా ముగ్గురికి సంబంధించిన న్యాయం డిసెంబర్ 12 వ తేదీన తేల్చనుందని ఆ మహిళ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







