వాట్సాప్ 'వీడియో కాలింగ్' పేరుతో యూజర్లు హ్యాకింగ్..
- November 18, 2016
వీడియో కాలింగ్ ఫీచర్‌ను వాట్సాప్ తాజాగా ప్రవేశపెట్టింది. స్పామర్లు క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వాట్సాప్ యూజర్లకు వీడియో కాలింగ్ ఇన్విటేషన్ వస్తోంది. దానిమీద క్లిక్ చేస్తే కొత్త ఫీచర్‌కు అనుసంధానం చేసే వెబ్‌పేజ్‌కి డైరెక్ట్ చేస్తోంది. స్పామ్ మెసేజ్‌లో ''వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రయత్నించేందుకు మిమ్మల్ని ఆహ్వానించాం. ఈ ఆహ్వానం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు'' అని ఉంటోంది. బాగా పరిశీలించగలిగిన యూజర్లను కూడా ఈ ఇన్విటేషన్ మోసగిస్తోంది. 'ఎనేబుల్' ట్యాబ్ మీద క్లిక్ చేస్తే యూజర్ వెరిఫికేషన్ అనే కొత్త పేజ్‌కు తీసుకెళ్తోంది.
ఇదే లింక్ నుంచి నలుగురు ఫ్రెండ్స్‌ను ఆహ్వానించాలని చెప్తోంది. ఈ ప్రక్రియ చాలా నమ్మకమైనదిగా కనిపిస్తోంది. కానీ దీనిని అనుసరించిన యూజర్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాట్సాప్ యాప్ ద్వారా వీడియో కాలింగ్ సదుపాయాన్ని పొందాలంటే సరైన ఏకైక మార్గం గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవడమే.
ఇది అప్డేట్ అయిన తర్వాత వీడియో కాలింగ్ ఫీచర్ ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









