చిల్లి చికెన్ బిట్స్
- November 19, 2016కావలసిన పదార్థాలు: ఎముకల్లేని చికెన్: అరకిలో, గుడ్డు: ఒకటి, మొక్కజొన్న పిండి: రెండు టేబుల్ స్పూన్లు, మైదాపిండి: ఒకటిన్నర స్పూను, ధనియాల పొడి: టేబుల్ స్పూను, మిరియాల పొడి: టేబుల్ స్పూను, జీలకర్ర పొడి: టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి ముక్కలు: రెండు టేబుల్ స్పూన్లు, టమోటా కెచప్: అర కప్పు, పచ్చిమిర్చి: రెండు టేబుల్ స్పూన్లు, కారం: సరిపడ, నీళ్ళు: కప్పు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత.
తయారీ విధానం: ముందుగా చికెన్ ముక్కలకు గుడ్డుసొన, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మొక్కజొన్న పిండి, మైదాపిండి, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టు కోవాలి. ఈ ముక్కలను ఓ గంట పాటు నాననిచ్చి అనంతరం వాటిని నూనెలో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగిన తరువాత టమోటా కెచప్, వేయించిన చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు చల్లి కొద్దిసేపు వేయించి కిందకు దించేయాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!