రెగ్యులర్ షూటింగ్‌లో బోయపాటి శ్రీను, బెల్లంకొండ సినిమా
- November 19, 2016
భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు పరిచయమై తనను తాను ప్రూవ్ చేసుకున్నబెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథనాయకుడుగా ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌ఫై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా ప్రొడక్షన్ నెం.2 చిత్రం ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సినిమా రేపటి(నవంబర్ 20) నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - ``మా ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌లో బోయపాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో తన మార్కు ఎంటర్‌టైన్మెంట్‌తో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ కొత్త చిత్రాన్ని హై బడ్జెట్‌తో రూపొందించనున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరికొత్త లుక్‌తో కనపడుతూ సాయి శ్రీనివాస్ పాత్ర స్టయిలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండేలా బోయపాటి శ్రీను ప్లాన్ చేశారు. ఎం.రత్నం ఈ చిత్రానికి మాటలు, రిషి పంజాబి సినిమాటోగ్రఫీ, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 20 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అందులో భాగంగా హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై స్టాండర్డ్స్‌లో సినిమాను తెరకెక్కించేలా సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మణ్, మాటలుః ఎం.రత్నం, సినిమాటోగ్రఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్రసాద్, నిర్మాతః మిర్యాల రవీందర్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః బోయపాటి శ్రీను.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







