విజయనగరం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
- November 19, 2016
ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లాలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా ఆర్టీసీకి చెందిన బస్సు నవరంగపూర్ జిల్లా రాయ్‌గఢ్ నుంచి 25 మంది ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా రామభద్రాపురం బైపాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నవరంగపూర్ జిల్లా దాబూగర్కు చెందిన సెహీనా సుల్తాన్(45), షకీలా సుల్తాన్(48), అయాన్(3) అక్కడికక్కడే మృతిచెందారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డీడీ నాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







