ప్రతిష్టాత్మక అవార్డు రేసులో దుబాయ్ కి చెందిన భారత బాలిక
- November 19, 2016
ప్రతిష్టాత్మక బాలల శాంతి బహుమతి రేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారత సంతతి బాలిక కేకాషణ్ బసు(16) నిలిచింది. బాలల హక్కులు, స్థితిగతులు మెరుగుపరచడానికి ఆమె చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు రేసులో ఉన్న తుది ముగ్గురిలో ఆమె కూడా నిలిచింది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా 120 ఎంట్రీలు వచ్చాయి. ఆదివారం(నవంబర్ 20) ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన చేశారు.
తుది పోటీలో ఉన్న ముగ్గురూ బాలల హక్కుల కోసం పోరాటాలు చేశారు. ప్రతీ యేటా ఈ అవార్డు గ్రహీతలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల ముందు తమ సందేశం వినిపించే అవకాశం లభిస్తుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డును 2006 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ అందించనున్నారు.
ఈ కార్యక్రమం హేగ్‌లోని హాల్ ఆఫ్ నైట్స్‌లో జరగనుంది.
కేకాషణ్ బసు ఎనిమిదేళ్ల వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించింది. 2012లో 'గ్రీన్ హోప్' అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా చెత్త సేకరణ, బీచ్‌లను శుభ్రం చేయడం, అవగాహనా సదస్సులను నిర్వహించడం వంటివి చేస్తుండేది. ఆమె ఇంతకు ముందు ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







