ప్రభాస్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్న నీల్ నితిన్ ముఖేష్
- November 20, 2016
'బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ చిత్రం తరువాత ఆయన సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు. దాదాపు రూ.150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది ఈ చిత్రం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.
కవలలైన ఇద్దరిలో ఒకరు హీరోకి స్నేహితుడిగా మరొకరు విలన్ గా కనిపించనున్నారట. ఈ రెండు పాత్రలు ఒకేలా ఉండడంతో పలు సందర్భాలలో హీరో కన్ఫ్యూజ్ అవుతాడట. ఈ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తాయని అంటున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









