త్రివిక్రమ్ దర్శకత్వం లో జోడి కట్టనున్న నితిన్, సమంత !!

- August 30, 2015 , by Maagulf
త్రివిక్రమ్ దర్శకత్వం లో జోడి కట్టనున్న నితిన్, సమంత !!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
వరుసగా ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత నాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక కూడా ఈ చిత్రం లో నటించ బోతున్నారు, ఆ వివరాలతో పాటు ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత రాధాకృష్ణ.
సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్-కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి,డి.వి.ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత
నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com