డిసెంబర్ 23న విడుదల కానున్న'మీలో ఎవరు కోటీశ్వరుడు'
- November 21, 2016
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 23న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - "పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెలలోనే చిత్రాన్ని రిలీజ్ చెయ్యాల్సి వుండగా, ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించాం.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా సూపర్‌హిట్ అయింది. తప్పకుండా మా బేనర్‌లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది" అన్నారు.
పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతి సోధి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్, డైలాగ్స్ డెవలప్‌మెంట్: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







