గల్ఫ్ లో తెలుగువారికి అండగా ఉంటాం--ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
- August 30, 2015
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారికి అండగా నిలుస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. పుల్లంపేట మండలం దేవసముద్రానికి చెందిన సంపతి నరసింహులు అనే వ్యక్తి ఇటీవల కువైట్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని కుమారుడు మధుకు ఆదివారం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి స్వగృహంలో కువైట్ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం కింద రూ.20వేలు చెక్కును ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే గల్ఫ్‌దేశాల్లో రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన వారు మృతి చెందితే చెన్నై నుంచి వారి మృతదేహాలను స్వగ్రామాలకు ఉచితంగా చేర్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జీవనోపాధి కోసం కువైట్, తదితర ప్రాంతాలకు వెళ్లిన వారి సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నామని చెప్పారు. గల్ఫ్‌లో మృతి చెందినా, ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే గల్ఫ్ వైఎస్సార్సీపీ నేతలు స్పందించి వారికి అండగా ఉంటుండటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







