ఇకపై అంత్యక్రియలు లైవ్‌లో...!
- November 22, 2016
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు శ్మశానవాటికలకు కూడా చేరువైంది. మరణించిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చే బంధుమిత్రులకు శ్మశానవాటిక ఉన్న ప్రాంతం గురించి, అంత్యక్రియల గురించి సమాచారం అందించాలన్నా, ఎవరైనా విదేశాల్లో ఉండి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాలేకపోయినా వారికి లైవ్‌లో అంత్యక్రియల కార్యక్రమం చూసేలా ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా శ్మశానవాటికలో మొట్టమొదటిసారి వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ ఇలాంటి శ్మశానం ఎక్కడుందనే కదా మీ సందేహం.తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన వేలగంపాడు శ్మశానవాటికలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ శ్మశానవాటిక నిర్వహణ బాధ్యతలను ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్‌కు చెన్నై నగర పాలక సంస్థ అప్పగించింది.దీంతో ఈ సంస్థ ఇక్కడ వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చింది. శ్మశానవాటికలో వైఫై సౌకర్యం ఏర్పాటు వల్ల తమకు ఆదరణ పెరిగిందని సంఘం వ్యవస్థాపక కార్యదర్శి హరిహరన్ అంటున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







