పామ్‌ జుమైరా బోర్డ్‌ వాక్‌ అందుబాటులోకి

- November 22, 2016 , by Maagulf
పామ్‌ జుమైరా బోర్డ్‌ వాక్‌ అందుబాటులోకి

11 కిలోమీటర్ల బోర్డ్‌ వాక్‌ పామ్‌ జుమైరాలో అందుబాటులోకి వచ్చింది. నఖీల్‌ ఛైర్మన్‌ అలి రషీద్‌ లూటా దీన్ని ప్రారంభించారు. 150 మిలియన్‌ దిర్హామ్‌ ఖర్చుతో దీన్ని రూపొందించారు. ఫిట్‌నెస్‌ కోసం వచ్చేవారికీ, లీజర్‌ టైమ్‌ని ఎంజాయ్‌ చేయాలనుకునేవారికీ ఇది చక్కని ప్రాంతంగా మారనుంది. బోర్డ్‌ వాక్‌పై వివిధ రకాలైన ఫుడ్‌ ట్రక్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నఖీల్‌ ఛైర్మన్‌ అలి రషీద్‌ లూటా మాట్లాడుతూ, బోర్డ్‌ వాక్‌ ఇంజనీరింగ్‌ అద్భుతానికి నిదర్శనమనీ, సరికొత్త ఆలోచనలతో పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటుగా, సర్వాంగ సుందరమైన అనుభూతిని అందరికీ కల్పించడానికి వీలవుతోందని, పామ్‌ జుమైరాకి ఇదో ప్రధాన ఆకర్షణ కానుందని అన్నారు. ఇప్పటికే పామ్‌ జుమైరాలో జాగింగ్‌, సైట్‌ సీయింగ్‌ వంటి సౌకర్యాలున్నాయి. వాటికి అదనంగా ఇంకా సరికొత్త అందాలు ఎన్నో సంతరించుకోనున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com