రజనీ ఒక గెలాక్సీ.... అక్షయ్‌కుమార్..
- November 22, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సినిమాలు ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లను పిలిచి తిరిగి డబ్బులిచ్చేస్తారట. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ఇటీవల జరిగిన '2.0' ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమంలో వెల్లడించారు. 'రజనీకాంత్ ఒక్క సూపర్‌స్టార్ కాదు, మొత్తం గెలాక్సీ ఆయనే. ఆయన స్టైల్‌ను నేర్చుకోవాలని అనుకోని వ్యక్తి ఉండరు. నాకు ఇంకా గుర్తుంది.. రజనీకాంత్ నటించిన 'బాబా' సినిమా బాగా ఆడలేదు. దీంతో ఆయన డిస్ట్రిబ్యూటర్లను పిలిచి వారి డబ్బును తిరిగి ఇచ్చేశారు. ఆయన సూపర్‌స్టార్ అనడానికి ఇది ఓ పెద్ద ఉదాహరణ.నాకు సహనం ఎక్కువ, ఈ చిత్రంతో ఆ సహనం ఇంకాస్త పెరిగింది. ఈ చిత్రానికి నన్ను తీసుకున్నందకు శంకర్ సర్‌కి, రజనీ సర్‌కి ధన్యవాదాలు. ఆయనకు(రజనీ) ప్రతినాయకుడిగా నన్ను ఎంపిక చేసుకున్నప్పుడు షాకయ్యా. నేను రజనీకి పెద్ద ఫ్యాన్‌ని' అని అక్షయ్‌కుమార్ చెప్పారు.ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదే కార్యక్రమానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. తనను ఆహ్వానించకపోయినప్పటికీ రజనీపై ఉన్న అభిమానంతో వచ్చినట్లు సల్మాన్ చెప్పారు
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









