2017 నాటికి అబుదాబీ - దుబాయ్ కొత్త హైవే సిద్ధం
- November 22, 2016అబుదాబీ జనరల్ సర్వీసెస్ కంపెనీ ముసానాదా, 62 కిలోమీటర్ల పొడవైన అబుదాబీ - దుబాయ్ హైవే వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని ప్రకటించింది. మునిసిపల్ ఎఫైర్స్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ముసానాదా చేపట్టిన ఈ ప్రాజెక్ట్, అబుదాబీ ఎమిరేట్‌లో అతి ముఖ్యమైన ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్‌గా చెప్పబడ్తోంది. ఎకనమిక్ డెవలప్మెంట్కి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ ఎక్స్టెన్సన్గ్గా రూపొందుతున్న ఈ హైవే, షుయైబ్ వద్ద అబుదాబీ బోర్డర్‌ని, అలాగే స్వైహాన్ ఇంటర్‌ఛేంజ్ ద్వారా దుబాయ్‌ని కనెక్ట్ చేస్తుంది. రెండు డైరెక్షన్లలోనూ నాలుగేసి లేన్లతో ఈ హైవే రూపుదిద్దుకుంటోంది. పీక్ అవర్స్‌లో అదనపు ట్రాఫిక్ని తట్టుకోగలిగేలా ఈ రోడ్డుని నిర్మిస్తున్నారు. అబుదాబీ సిటీ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, యాస్ సాదియాత్ ఐలాండ్స్‌ని ఈ హైవే కనెక్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి