కిం కర్దర్షియాన్‌ తరహాలో ఖతారీలపై దోపిడీ

కిం కర్దర్షియాన్‌ తరహాలో ఖతారీలపై దోపిడీ

ప్యారిస్‌లో ఇటీవల ప్రముఖ సెలబ్రిటీ కిమ్‌ కర్దర్షియాన్‌పై దాడి చేసిన విధంగానే దోపిడీ దొంగలు, ఇద్దరు ఖతారీ మహిళలపై దాడి చేసి 5 మిలియన్‌ యూరోల విలువైన వస్తువుల్ని వారి నుంచి దుండగులు దోపీడీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలే భారతదేశానికి చెందిన ప్రముఖ నటి మల్లికా షెరావత్‌ మీద కూడా ఇలాంటి దాడే జరిగింది. 60 ఏళ్ళ పైబడిన ఖతారీ మహిళలు, లె బోర్‌గెట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు. వారి కారుని మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు అడ్డగించి, వారిపై టియర్‌ గ్యాస్‌ని స్ప్రే చేసి, దొంగతనానికి పాల్పడ్డారు. ఆభరణాలు, లగేజ్‌, బట్టలు సహా అన్నీ దోచుకుని ఉడాయించారు. ప్యారిస్‌లో ఈ తరహా దాడులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అతి ఖరీదైన ప్రాంతంగానేకాక, అత్యంత లగ్జరియస్‌ షాపింగ్‌ కేంద్రంగా ప్యారిస్‌ వర్దిల్లుతోంది. ఆ కారణంగా దోపిడీలు కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయిక్కడ. ప్రభుత్వానికి ఈ దొంగతనాలు సవాల్‌గా మారుతున్నాయి.

Back to Top