' పవిత్ర కాబా సైటును అవమానపర్చిన ' భారతీయుడు అరెస్ట్
- November 23, 2016
చేతిలో కెమెరా మొబైల్ ఫోన్ ఉంది కదా అని...ఏ చిత్రమైనా తీయాలని ముచ్చటపడితే గల్ఫ్ లో ముప్పతిప్పలు తప్పవని ఈ వార్త రుజువు చేస్తుంది..అమాయకంగా ఫోటో తిసేనని తప్పు ఒప్పుకొంటే కొంతమేర శిక్ష తగ్గేదేమో...కానీ ఉద్దేశ్యపూర్వకంగా పేస్ బుక్ లో పోస్ట్ చేసి తన నేరాన్ని బహిర్గతపర్చుకొన్నాడా ప్రవాస భారతీయ వ్యవసాయ కార్మికుడు.. పేస్ బుక్ లో ' పవిత్ర కాబా ' సైట్ ను అవమానించిన నేరానికి ఒక వలస భారతీయుడిని సౌదీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక నివేదిక సోమవారం తెలిపింది. అనుమానితుడిని పెట్టుకొనేందుకు ప్రాంతీయ పరిశోధక సంస్ అన్వేషించి వ్యవసాయ పని చేస్తున్న ఓ నలభై ఏళ్ళ వ్యక్తిని అరెస్టు చేశామని ఆ వ్యక్తి మా పవిత్రమైన స్థలం అవమానించిన కారణంగా ఈ చర్య తీసుకొన్నట్లు రియాడ్ పోలీసు ప్రతినిధి అన్నారు. ఆ వ్యక్తి కాబా పవిత్ర స్థలంలో ఫోటో తీయడమే కాక ఆ చిత్రాన్ని పేస్ బుక్ సామాజిక మీడియాలో పోస్టు చేయడం మేము ఒక తీవ్రమైన చర్యగా భావిస్తున్నట్లు " ఆ పొలిసు ప్రతినిధి పేర్కొన్నారు. రియాద్ జిల్లాలో అల్ మజ్మాహె నగరంలో వ్యవసాయ క్షేత్రం వద్ద పేరు గోప్యంగా ఉంచబడిన ఒక భారతీయుడిని పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







