ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- January 23, 2026
ప్రపంచ పౌర విమానయాన రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా (BOEING), యూరప్ (AIRBUS) సంస్థల గుత్తాధిపత్యానికి తెరదించేందుకు రష్యా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న విమానయాన మార్కెట్‌ను అందిపుచ్చుకుంటూనే.. ఇక్కడే విమానాలను తయారు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్యలు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమానాలకు ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా.. కొత్త విమానాల డెలివరీకి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ఇలాంటి సమయంలో రష్యా(Russia) తన పౌర విమానాలను భారత్‌కు ఆఫర్ చేస్తోంది. 1500 కిలో మీటర్ల లోపు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం సుఖోయ్ సూపర్ జెట్ (SSJ)-100, ఇల్యూషిన్ (IL)-114లను తీసుకు వస్తోంది. అయితే ఇవి చిన్న రన్‌వేలపై కూడా సులభంగా ల్యాండ్ కాగలవు. అలాగే 3000 కిలో మీటర్ల వరకు వెళ్లే మధ్యస్థ శ్రేణి కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన MS-21ను అందుబాటులోకి తీసుకు రానున్నారు.
6500 కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణాల కోసం.. బోయింగ్ 767కు ధీటుగా నిలిచే అత్యాధునిక TU-214 విమానాలను తయారు చేయబోతున్నారు. అయితే ఈ విమానాలకు ఉండే ఇంజిన్లు, ఇంటీరియర్స్, ఇతర కీలక భాగాలు పూర్తిగా రష్యా స్వదేశీ సాంకేతికతతోనే తయారు అయ్యాయి. పాశ్చాత్య విమానాలతో పోలిస్తే వీటి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం విమానాల విక్రయానికే పరిమితం కాకుండా భారత్‌లో వీటి ఉత్పత్తిని ప్రారంభించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో కలిసి సంయుక్తంగా ఈ విమానాలను తయారు చేసే అంశంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ‘వింగ్స్ ఇండియా 2026’ ఎయిర్ షో రష్యా విమానాలకు ప్రధాన వేదిక కానుంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









