దూసుకొస్తున్న హితుడు
- August 31, 2015
హిరో జగపతి బాబు హితుడుగా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హితుడు చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత కేఎస్వీ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ మొదటి వారం లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కొత్త దర్శకుడు విప్లవ్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే ఈ చిత్రంలో జగపతి బాబు హీరో గా మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారని నటనలో అనేక చ్చాయలు ప్రదర్శిం చారని ప్రకటనలో పేర్కొనారు. జగపతి బాబు తో బాటు ప్రధాన భూమిక లో మళయాళ నటి మీరా నందన్ నటించారు. బెనర్జీ సీ వీ ఎల్ ఇతర పాత్రల్లో సహకరించారు. అరకు లో ఎక్కువ భాగం చిత్రీకరించిన ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను వైజాగ్ హైదరాబాద్ లలో వివధ లొకేషన్ లలో పూర్థి చేశారు చిత్రం లోని అయిదు పాటలు అనంత శ్రీ రామ్ రచించగా కోటి సంగీతం ఆందించారు. భరణి కె ధరన్ చాయాగ్రహణం అందించగా ధర్మేంద్ర కాకరాల ఎడిట్ చేశారు త్వరలో ఆదియో విడుదల జరుగుతుందని నిర్మాత కేఎస్వీ తెలిపారు . ప్రముఖ నిర్మాత మధు మురళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









