డ్రైవర్‌ టెస్ట్‌ కోసం ఆర్‌టిఎ స్మార్ట్‌ యార్డ్‌

- November 23, 2016 , by Maagulf
డ్రైవర్‌ టెస్ట్‌ కోసం ఆర్‌టిఎ స్మార్ట్‌ యార్డ్‌

యూఏఈ ఇన్నోవేషన్‌ వీక్‌ (20 నుంచి 26 నవంబర్‌ 2016) సందర్భంగా రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ), స్మార్ట్‌ యార్డ్‌ ఇనీషియేటివ్‌ని ప్రారంభించింది. డ్రైవర్‌ లైసెన్స్‌ అప్లికెంట్స్‌ కోసం వన్‌ కీ టెస్టింగ్‌ ఫేజెస్‌ ఈ స్మార్ట్‌ ఇనీషియేటివ్‌ ఉద్దేశ్యం. సోఫిస్టికేటెడ్‌ టెక్నలాజికల్‌ డివైజెస్‌ మరియు టెస్టింగ్‌ వెహికిల్‌తో ఈ యార్డ్‌ ఏర్పాటయ్యింది. ఈ స్మార్ట్‌ యార్డ్‌తో ఖచ్చితత్వంతో కూడిన రిజల్ట్‌ రానుంది. ఆర్‌టిఎకి సంబంధించినంతవరకు ఇది ఓ సరికొత్త ఐడియా అని, స్మార్ట్‌ యార్డ్‌ గురించి చెప్పారు ఆర్‌టిఎ లైసెన్సింగ్‌ ఏజెన్సీ సిఇఓ అహ్మద్‌ బహ్రూెజియాన్‌. మొత్తం ఐదు సర్వైలైన్స్‌ కెమెరాలు ఇందులో ఉంటాయి. నాలుగు కెమెరాలు వాహనం బయట, ఐదవ కెమెరా లోపల అమర్చబడి ఉంటుంది. 20 సెన్సార్లతో వాహనం ఫిట్‌ అయి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇమేజెస్‌ని పంపడం ద్వారా వాహనం టెస్ట్‌ డ్రైవ్‌పై ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. ప్యారలల్‌ పార్కింగ్‌, రోడ్‌సైడ్‌ పార్కింగ్‌ (60 డిగ్రీల ఇన్‌క్లినేషన్‌), గ్యారేజ్‌ పార్కింగ్‌, స్లోప్‌ మరియు సడెన్‌ బ్రేకింగ్‌ వంటి ఐదు ముఖ్యమైన అంశాలు ఇందులో ఉంటాయి. డ్రైవర్‌ టెస్ట్‌కి సంబంధించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా స్మార్ట్‌ యార్డ్‌ ఉపయోగపడ్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com