చెక్-ఇన్ బ్యాగేజ్లో 'నో పవర్ బ్యాంక్స్'
- November 23, 2016
మస్కట్: విమానాల్లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7లను ఇప్పటికే రద్దు చేసిన పలు విమానయాన సంస్థలు, చెక్-ఇన్ లగేజ్‌లలో ఎలాంటి పవర్ బ్యాంక్లనూ అనుమతించడంలేదు. అయితే క్యారీ ఆన్ బ్యాగ్స్ (హ్యాండ్ బ్యాగ్స్)లో మాత్రం ఒక్కొక్కరికీ రెండు పవర్ బ్యాంక్స్ వరకు అనుమతిస్తామని ఒమన్ ఎయిర్ అధికార ప్రతినిథి వెల్లడించారు. ఒమన్‌లోని జెట్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ మన్ను ఆనంద్ మాట్లాడుతూ, పవర్ బ్యాంక్స్‌ని చెక్-ఇన్ లగేజ్‌లో అనుమతించడంలేదనీ, క్యాబిన్ బ్యాగ్స్‌లో మాత్రం వాటికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. శ్యామ్‌సంగ్ గేలాక్సీ నోట్ 7ని ఇంటివద్దే ఉంచి రావాలనీ, పవర్ బ్యాంక్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచుకోవచ్చునని ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, పవర్ బ్యాంక్‌లను డేంజరస్ ఐటమ్‌గా ఫ్లైట్ రెగ్యులేషన్స్‌లో పేర్కొంది. లిథియమ్ బ్యాటరీలతో ప్రమాదాలు జరుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పవర్ బ్యాంక్‌లను, ఇతరత్రా బ్యాటరీలను తనిఖీలు చేసేందుకు ప్రత్యేక స్కానర్లను ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఏర్పాటు చేశారు. ఒమన్‌లోనూ తనిఖీలు అత్యంత కట్టుదిట్టంగా జరుగుతాయి.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







