ప్రామాణిక లక్షణాలు లేని ఎలక్ట్రికల్ హీటర్లు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం

- November 23, 2016 , by Maagulf
ప్రామాణిక లక్షణాలు లేని ఎలక్ట్రికల్ హీటర్లు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం

రియాద్:శీతాకాలం మొదలవడంతో ప్రామాణిక లక్షణాలకు అనుగుణంగా ఉండని ఎలక్ట్రికల్ హీటర్లని మార్కెట్లో విక్రయించడంపై వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ (MCI) సౌదీ తనిఖీ  పరిశీలన బృందం ప్రచారంని ప్రారంభించింది. వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, ఈ తనిఖీలు ఇంటికి ఉష్ణాన్నికల్గించే పరికరాలు,ముఖ్యంగా విద్యుత్ హీటర్లు, మరియు ఈ అంశాలను నిల్వ ఉంచే గిడ్డంగులలో ఉంచి అమ్మే రిటైల్ దుకాణాలపై ఉంటాయని అన్నారు. ఈ తనిఖీలు ప్రామాణిక మరియు లక్షణాలు ప్రదర్శించబడే పరికరాల అనుగుణ్యత ధ్రువీకరించడం సోధీ రాజ్య వ్యాప్తంగా ఉంటుందిని తెలిపారు. సరైన ప్రామాణిక లక్షణాలు లేని పరికరాలు వలన వినియోగదారుల భద్రతకు ముప్పు కల్గించడం వారిని  అపాయానికి గురి చేయడం సరికాదని అటువంటి ఏ పరికరం ఏ దుకాణాలలో జప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారి ఆ దుకాణ యజమానుల 5,000 ఎస్ ఆర్  లేదా రెండు సంవత్సరాల జైలుశిక్ష ఉంటుందని కొన్ని సందర్భాలలో రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని ఆయన తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com