జపాన్ భూప్రకంపనలతో వణికిపోతోంది
- November 23, 2016
జపాన్ భూప్రకంపనలతో వణికిపోతోంది. రెండు రోజుల క్రితం భారీ భూకంపంతో తల్లడిల్లిన జపాన్ ఈ రోజు తెల్లవారుజామున మరోసారి చిగురుటాకులా వణికింది. జపాన్‌లోని ఫుకుషిమాలో తెల్లవారుజామున 2.53 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6గా భూకంప తీవ్రత నమోదైంది. ఇవాకికి 42 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ఫుకుషిమాలో అణు విద్యుత్ కేంద్రం సమీపంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏ నిమిషం ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సునామీలు, భూకంపాల నుంచి జపాన్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







