విస్తారా, గోఎయిర్ విమానయాన సంస్థలు తక్కువ ధరలకు విమానయానా ఆఫర్
- November 23, 2016
విస్తారా, గోఎయిర్ విమానయాన సంస్థలు తక్కువ ధరలకు విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. విస్తారా రూ.999కు, గోఎయిర్ రూ.736కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. 'సెలెబ్రేషన్ సేల్'' పేరుతో అందిస్తున్న తమ ఆఫర్ కోసం బుధవారం నుంచి శుక్రవారం అర్థరాత్రి (ఈ నెల 25) వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా వెల్లడించింది. వచ్చే నెల 5 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 లోపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ఎకానమీ క్లాస్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
గోఎరుుర్ విమానయాన సంస్థ తక్కువ ధరకే, రూ.736 ధరకు విమాన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. అన్ని రూట్లలో వర్తించే ఈ ఆఫర్‌కు నేటి వరకూ (ఈ నెల 24న) టికెట్లు బుక్ చేసుకోవచ్చని గో ఎరుుర్ సంస్థ తెలిపింది.
ఈ ఆఫర్‌తో వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మార్చి 31 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొంది. రూ.500, రూ.1,000 నోట్లు నేటి అర్థరాత్రి వరకూ తమ టికెట్ కౌంటర్లలో చెల్లుతాయని వివరించింది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







