యూకే ప్రభుత్వం వీసా మార్పులు అమల్లోకి..
- November 23, 2016
వలసదారుల సంఖ్యను నియంత్రించేందుకు యూరోపియన్ యూనియనేతర ప్రజల కోసం యూకే ప్రభుత్వం వీసా విధానంలో చేసిన మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి వల్ల భారీ సంఖ్యలో భారత ఐటీ ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. యూకే హోం శాఖ గత నెలలో ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం... నవంబర్ 24న లేదా ఆ తర్వాత టైర్ 2 అంతర కంపెనీ బదిలీ(ఐసీటీ) కోసం చేసుకునే దరఖాస్తులకు కనీస వేతనం 30 వేల పౌండ్లు ఉండాలి. ఇంతకు పూర్వం ఇది 20 వేల 800 పౌండ్లు. ఐసీటీ విధానం కింద జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే దక్కించుకున్నారని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ తెలిపింది. .
వీసా విధానంలో చేసిన మార్పులు మన ఐటీ ఇంజనీర్లకు శరాఘాతంగా పరిణమించనున్నాయి.
వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు.
దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







