రోడ్డు ప్రమాదం: మెడికల్ అబ్జర్వేషన్‌లో బాధితుడు
- November 23, 2016
మస్కట్: రోడ్డు ప్రమాదంలో తన తల్లిని, తన భర్తనీ కోల్పోయిన మైమూత్ అమీర్ అనే మహిళకు, ఇంకా ఆ ఘటనతో చనిపోయినవారి వివరాల్ని తెలియజేయలేదు. ప్రస్తుతం ఆమె ఇంకా షాక్‌లో ఉన్నారనీ, అందుకే ఆమెను పూర్తిస్థాయిలో అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు వెల్లడించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా జరిగిన ప్రమాదం గురించి బాధితురాలికి ఇంకా చెప్పలేదు. భర్త, తల్లితో కలిసి కారులో వెళుతున్న మైమూత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వీరు ప్రయాణిస్తున్న కారు మరో కారుని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో మిగతా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మైమూత్ ముగ్గురు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. ఆ ముగ్గురూ అల్ ఖౌద్ సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ళ ఫాతిమాకి సర్జరీ జరిగింది. మిగతా ఇద్దరికి మాత్రం చిన్న గాయాలే అయ్యాయి. వరుసగా సెలవులు రావడంతో, మృతదేహాల్ని పంపించేందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్లు మృతుల బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







