ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఇప్పుడు ఢిల్లీలో
- November 24, 2016
అంతర్జాతీయ మైనం మ్యూజియంగా పేరు పొంది ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకునే మేడమ్ టుస్సాడ్స్ శాఖను త్వరలో దేశరాజధాని దిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. టుస్సాడ్స్ మ్యూజియం శాఖలు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్నాయి. దిల్లీలో తన 22వ మ్యూజియాన్ని ప్రారంభించనుంది. 2017 మధ్య నాటికి కన్నాట్ ప్లేస్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు గడించిన వారి మైనం విగ్రహాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ తెందుల్కర్, కిమ్ కర్దాషియన్, అమితాబ్ బచ్చన్ తదితరుల విగ్రహాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌లోని డోర్సెట్ ప్రధాన కేంద్రంగా మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని నిర్వహిస్తోంది.
లండన్‌లో ఉన్న మైనం మ్యూజియంలో భారతీయ ప్రముఖులు ప్రధాని నరేంద్రమోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, జాతిపిత మహాత్మాగాంధీ, అందాల తార ఐశ్వర్యారాయ్ ప్రతిమలు కొలువుదీరాయి. లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో తొలిసారిగా బాలీవుడ్ నటుడు అమితాబ్ ప్రతిమను 2000లో ఏర్పాటు చేసినట్లు మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్ చీఫ్ న్యూ ఓపెనింగ్స్ ఆఫీసర్ జాన్ జాకోబ్‌సేన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







