సమ్మె కారణంగా లుఫ్తాన్స విమానాలను నిలిపివేసింది.
- November 25, 2016
జర్మనీ ఫ్లాగ్ షిప్ ఎయిర్ లైన్ లుఫ్తాన్స దాదాపు 830 దేశీయ, యూరోపియన్ విమానాలను శుక్రవారం నిలిపివేసింది. దీంతో 1,00,000 మంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పైలెట్లు చేస్తున్న సమ్మె కారణంగా విమానాలను నిలిపివేస్తున్నట్టు ఎయిర్ లైన్ ప్రకటించింది. పైలెట్లు సమ్మె నేటికి మూడో రోజుకు చేరుకుంది. వారు సమ్మెకు దిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2600 విమానాలను ఆ ఎయిర్ లైన్ రద్దుచేసింది. పైలెట్లు చేస్తున్న ఈ సమ్మె శనివారం వరకు పొడిగించనున్నట్టు పైలెట్ల యూనియన్ గురువారం ప్రకటించింది.2014 ఏప్రిల్ నుంచి లుఫ్తాన్స లో ఈ సమ్మె జరగడం 14వ సారి. ప్రతేడాది 3.66 శాతం వేతనాలను పెంచాలని అప్పటినుంచి పైలెట్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది.అయితే మేనేజ్ మెంట్ కేవలం 2.5 శాతం మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఆస్ట్రేలియన్ ఎయిర్ లైన్సు, స్విస్ రెండు కూడా లుఫ్తాన్స లో భాగం. జర్మనీకి వారి సేవలు విస్తరిస్తున్న క్రమంలో పైలెట్లు ఈ సమ్మెకు దిగారు. అయితే గ్రూప్ కు చెందిన ఇతర విమానయాన సంస్థలు జర్మన్ వింగ్స్, ఎయిర్ డోలోమిటి, బ్రూసిల్స్ ఎయిర్ లైన్సు ఈ సమ్మెకు ప్రభావితం కాలేదు.లుఫ్తాన్సలో జరుగుతున్న ఈ సమ్మెతో రోజుకు ఆ గ్రూప్ 10 మిలియన్ యూరోలు(రూ.72కోట్లు) కోల్పోనుందని టాప్ సెల్లింగ్ డైలీ బిల్డ్ రిపోర్టుచేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







