సెన్సార్ పూర్తి చేసుకున్న సప్తగిరి ఎక్స్ ప్రెస్
- November 26, 2016
శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ఆడియో విడుదల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లహరి వారు ఈ చిత్ర ఆడియోను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. పాటలకి సైతం భారీ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘యు/ఏ’ రేటింగ్ తో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ తెలిపారు. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, ఫైట్స్ : స్టంట్స్ జాషువా, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









