'తెలుగుదేశం--కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా జన చైతన్య యాత్రలు

- November 26, 2016 , by Maagulf

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున చేపట్టిన జన చైతన్య యాత్రలకు అనుబందంగా కువైట్ లో తెలుగుదేశం పార్టీ నిన్న కువైట్ లోని ఫర్వానియా ప్రాంతములో జన చైతన్య యాత్రను నిర్వహించింది. అధ్యక్షులు సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించటo జరగినది. కమిటీ సభ్యులు వందలాదిమంది కార్యకర్తలు మరియు తెలుగు దేశం అభిమానులు పాల్గొని చైతన్య యాత్రను విజయవంతం చేసారు. చంద్రబాబు నాయుడు  ప్రభుత్వ పతకాలను ప్రజలకు వివరించి ప్రజలను చైతన్య వంతులను చేసి పార్టీలోకి ఆహ్వానించి పార్టీతీర్ధం ఇచి పార్టీని బలోపేతం చేసే విదoగా  జన చైతన్య యాత్రను నిర్వహించారు. ప్రముఖ కడప నాయకులు ముస్తాక్ ఖాన్ మరియు వారి అనుచర వర్గం,  రాయచోటి యూత్ నాయకులు చోటు మరియు వారి అనుచర వర్గం,  నాగిని పార్వతి మరెంతో మందిని అద్యక్షులు సుధాకర్ రావు కండువా కప్పి తెలుగు దేశం కువైట్ లోకి సాదరంగా ఆహ్వానించటo జరిగింది. కువైట్ లో వున్న తెలుగు వారి కోసం తెలుగు దేశం కువైట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సభకు వెల్ఫేర్ కోఆర్డినేటర్   జీలకర్ర మురళి వివరించారు. సభను ప్రధాన కార్యదర్సి మోహన్ ఆధ్వర్యంలో రవి కుమార్ రాజు నిర్వహించారు. ఇంకా రమేష్ నాయుడు , రాధ మాధవ్ , సుబ్బా రెడ్డి , బాబు నాయుడు, ఈశ్వర్ నాయుడు ,రహమతుల్లా పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com