రిటైర్డ్ కండక్టర్ ధనుష్ కోసం కోర్టును ఆశ్రయించారు..
- November 26, 2016
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ మా కుమారుడంటే.. కాదు మాకే పుట్టాడంటూ రెండు జంటల మధ్య సరికొత్త వివాదం మొదలైంది. మదురై జిల్లా మల్లంపట్టికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్ కదిరేశన్(60), మీనాక్షి(58) దంపతులు ధనుష్ కోసం కోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన మేలూరు కోర్టు జనవరి 12న నేరుగా హాజరు కావాలంటూ ధను్‌షకు సమన్లు జారీ చేసింది. వివరాలు.. కదిరేశన్ దంపతుల పిటిషన మేరకు.. ధనుష్ 7.11.1985లో జన్మించారు.అసలు పేరు కలైసెల్వన్. తిరుపత్తూరు ప్రభుత్వ కళాశాలలో 11వ తరగతి చదువుతూ.. ఇంటి నుంచి పారిపోయా డు. అనంతరం, దర్శకుడు కస్తూరి రాజా వద్ద పనిలో చేరి, నటుడిగా ఎదిగాడు.అతన్ని కలుసుకునేందుకు కదిరేశన దంపతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వృద్ధులైన తమకు అనారోగ్య సమస్యలున్నాయని, అందువల్ల ధనుష్ నుంచి నెలకు రూ.65 వేల పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇదిలావుంటే, దనుష్ తమ కన్న కొడుకని దర్శకుడు కస్తూరి రాజా వ్యాఖ్యానించారు.ఈ వివాదం తమకు ఎంతో ఆవేదన కలిగిస్తోందన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







