భారత్ దిగుమతులను తాత్కాలికంగా పాక్ నిలిపివేసింది..
- November 27, 2016
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి చేసుకుంటున్న దిగుమతులను పాక్ ఆపేసింది. భారత్ నుంచి పత్తి, కూరగాయలను పాక్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వాటి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎటువంటి హెచ్చరికలు కానీ, నోటీసులు కానీ లేకుండానే పాక్.. భారత్ నుంచి పత్తి, కూరగాయల దిగుమతిని ఆపేసిందని కాటన్ ఇంపోర్టర్స్ అండ్ కస్టమ్స్ క్లియరింగ్ ఏజెంట్లు తెలిపారు. మరోవైపు తమ దేశంలోని రైతుల సంక్షేమం కోసమే భారత్ నుంచి దిగుమతులు ఆపేసినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్(డీపీపీ) చీఫ్ ఇమ్రాన్ షమీ తెలిపారు.''మా రైతులను రక్షించుకునేందుకే భారత్ నుంచి టమాటా, ఇతర తాజా కూరగాయల దిగుమతిని రద్దు చేశాం. మా దగ్గరే చాలినన్ని టమాటాలు, ఇతర కూరగాయలు ఉన్నాయి. మా దగ్గర కొరత ఉంటేనే వాటిని దిగుమతి చేసుకునేవాళ్లం'' అని ఇమ్రాన్ వివరించారు. అయితే భారత్ నుంచి పత్తి దిగుమతులను మాత్రం ఆపలేదని, భారత్ ఎగుమతులు తమ బయో సెక్యూరిటీ షరతులకు అనుగుణంగా లేకపోవడంతో ఆంక్షలు విధించామని తెలిపారు.తమ రిపోర్టులు తప్పని తేలితే తిరిగి పత్తి దిగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తామని ఇమ్రాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







