లింగమార్పిడి వ్యక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త
- November 27, 2016
లింగమార్పిడి(ట్రాన్స్జెండర్లు) చేయించుకున్న వ్యక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్ ఫామ్లలో వారిని 'థర్ట్ జెండర్'(మూడో లింగం)గా పరిగణిస్తూ ప్రత్యేకంగా ఓ కాలమ్ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ ఫామ్లలో ఈ కాలమ్ ఏర్పాటు చేయాలన్న ఢిల్లీకి చెందిన ఓ లాయర్ సూచన మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే, ఐఆర్సీటీసీ తాజా నిర్ణయంతో అటు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లోనూ ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ అందుబాటులోకి రానుంది. రైల్వే నిర్ణయంపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని చెబుతున్నారు. తమకోసం ప్రత్యేకంగా సీట్లు, ప్రత్యేక కోచ్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







