ఉప్పుతో కలిగే ముప్పు
- September 01, 2015
కూరలో కొంచెం ఉప్పు ఎక్కువయినా కూడా ఆ కూర నాలుకకి రుచించదు. కానీ నిజానికి మనం ఎంత ఉప్పు తీసుకోవాలన్నది మనం నాలుకకి చేసే అలవాటుని బట్టి ఉంటుందట. జిహ్మకో రుచి అన్నట్టుగా మనకు తెలీకుండానే కావాలిన దానికన్నా ఎక్కువ మోతాదులో మనం ఉప్పు తినేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. మన జీవితంలో ప్రతిరోజూ 5 నుంచి 6 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలట. అంటే ఒక చెంచా ఉప్పు ఈ మోతాదుకు సరిపోతుందన్న మాట. ఉప్పు అధికంగా తీసుకుంటే బీపీ ఎక్కువవుతుందనే విషయం తెలిసిందే. అంతేకాకుండా హైబీపీతో పాటు జీర్ణాశయం లోపల జిగురు పొర దెబ్బ తినడంతో జీర్ణ కోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మాంసకృత్తులు లోపించిన చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల పాదాల్లో నీరు చేరడంలాంటివి, ఒళ్లు ఉబ్బడం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగని ఉప్పు మొత్తం తగ్గించేయ్యడం కూడా మంచిది కాదు. శరీరం తగిన మోతాదులో అందే సోడియం ఉప్పు నుండి లభిస్తుంది. ఒంట్లో సోడియం తగ్గితే విపరీతమైన అలసట, నిస్సత్తువ, చికాకు వికారం, పరధ్యానంలాంటి మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. అందుకే మితంగా ఉపయోగించాలి. అతిగా ఉపయోగించకూడదు.
తాజా వార్తలు
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం







