రోజు రోజు కి పెరుగుతున్న 'ఐఎస్‌ఐఎస్' దారుణాలు

- September 01, 2015 , by Maagulf
రోజు రోజు కి పెరుగుతున్న 'ఐఎస్‌ఐఎస్' దారుణాలు

ప్రత్యర్థులను హింసించి చంపడంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు వినూత్నమైన వికృత పద్ధతులను అనుసరిస్తున్నారు. అనుసరించిన పద్ధతిని మళ్లీ అనుసరించకుండా కొత్త రకంగా చంపేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థుల హత్యలకు సంబంధించి ఉగ్రవాదులు తాజాగా విడుదల చేసిన వీడియో యమలోక హింసకు నకలుగా ఉంది. ఇరాక్ సైనికుల తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో పట్టుకున్న నలుగురు ఇరాకీల చేతులు, కాళ్లను గొలుసులతో కట్టేసి పైన ఏర్పాటు చేసిన ఓ రాడుకు తలకిందులుగా వేలాడదీశారు. ముందుగానే వారికి బత్తాయి పండు రంగుగల బాయిలర్ దుస్తులను తొడిగారు. వారికింద నుంచి నేలపై ధారలుగా పెట్రోలు పోసి ఓ చివరన కాగడాతో ఆ పెట్రోలు ధారలను అంటించారు. అంతే ... నేలపైనున్న పెట్రోలు అంటుకొని ఆ మంటలు క్రమంగా ముందుకెళ్లి ఆ నలుగురు ఇరాకీల శరీరాలకు అంటుకున్నాయి. ఆ మంటల్లో చిక్కుకున్న వారి శరీరాలు కొంకర్లు తిరిగిపోయాయి. వారు నిలువునా అగ్ని కీలలకు సజీవంగా ఆహుతయ్యారు. వారిని ఈ తీరున హత్య చేయడానికి ముందు పట్టుబడిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను ఇరాక్ సైనికులు, షియా ముస్లింలు హింసించి చంపిన వీడియోలను వారికి చూపించారు. అంతకన్నా క్రూరంగా చంపుతామంటూ బందీలను ముందుగానే మానసికంగా భయభ్రాంతులకు గురిచేశారు. చావడానికి ముందు నలుగురు ఇరాకీలు తాము ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా పట్టుబడ్డారో వివరించిన దృశ్యాలు కూడా తాజా వీడియోలు ఉన్నాయి. ఇరాక్‌లోని అన్బర్ ప్రాంతంలో ఈ వీడియోను తీసినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com