ఈ ఏడాది 4,700 మంది మధ్యధరా సముద్రంలో మృతి..
- November 29, 2016
బతుకును వెతుకుతూ యూరప్‌కు వలస వెళ్తున్న వారి జీవితాలు మధ్యలోనే మధ్యధరా సముద్రం పాలవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిరకు యూరప్‌కు వలస వెళ్లడానికి ప్రయత్నించిన 4,700 మంది మధ్యధరా సముద్రంలో మృతి చెందారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐఓఎమ్) తాజాగా వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు యూరప్ వలసదారుల సంఖ్య తగ్గినప్పటికీ.. మధ్యధరా సముద్రంలో మృతి చెందిన వారి సంఖ్య మాత్రం పెరిగింది.2015లో నవంబర్ 30 నాటికి మధ్యధరా సముద్రంలో మృతి చెందిన వలసదారుల సంఖ్య 3,565గా ఉంది. ఐఓఎమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది సముద్రమార్గం గుండా యూరప్ చేరుకున్న వలసదారుల సంఖ్య 8,83,393 గా ఉండగా..2016లో ఈ సంఖ్య 3,48,664కు తగ్గింది. అయినప్పటికీ మధ్యధరా సముద్రంలో మృతుల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. పశ్చిమ ఆఫ్రికా నుంచి ఇటలీకి చేరుకునే క్రమంలో ఎక్కువమంది వలసదారులు మృతి చెందినట్లు ఐఓఎమ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







